UPDATED 20th APRIL 2018 FRIDAY 11:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో విశేష ప్రతిభ కనబరిచినట్లు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి తెలిపారు. ప్రముఖ బహుళ జాతి సంస్థ "విప్రో" నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్రాత, మౌఖిక పరీక్షలలో పది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డా. ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ బహుళజాతి సంస్థ విప్రోలో ఉద్యోగాలకు తమ కళాశాల విద్యార్థులు బి. లలిత, కె. సాయిలక్ష్మి, ఎ. అసిమా పఠాన్, బి. మహాలక్ష్మి, వి. ఆశా, పి.సువర్ణ శైలజ, కె. సాయిసుధ, వి. ఆదిత్య సాయికుమార్, జి. రాము, ఎ. ఉదయభాస్కర్ ఎంపిక కావడం ఆనందంగా ఉందని అన్నారు. డిగ్రీపట్టాతో పాటు మంచి సంస్థలో ఉద్యోగ నియామక పత్రంతో తమ విద్యార్థులు జీవితంలో మంచిస్థాయిలో నిలిచేలా ఆదిత్య నిరంతరం కృషి చేస్తుందని, విద్యార్థుల తల్లితండ్రుల నమ్మకాన్ని నిలబెట్టడంలో తమ సంస్థ ప్రత్యేకత చాటుకుంటూ ఉందని అన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణ, అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, నిష్ణాతులైన అధ్యాపకులతో సదస్సుల నిర్వహణ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థి చదువుతో పాటుగా వారిలో దాగిఉన్న నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ ఉండడమే కారణమని ఆమె అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, తదితరులు అభినందించారు. .







