బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

కాకినాడ /అన్నవరం, 26 మే 2020 (రెడ్ బీ న్యూస్) : కరోనా వైరస్ నేపధ్యంలో బ్రాహ్మణుల ఆర్థిక అవసరాలు తీర్చడానికి విరివిగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జి. నాగసాయి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ మల్లాది విష్ణు ఆదేశాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాకు రూ.1.23 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. సత్యదేవుని సన్నిధిలో వ్రతపురోహితులుగా పనిచేస్తున్న 48 మంది అర్చకులకు సత్యదేవ సేవామిత్ర పథకం ద్వారా కాకినాడ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రూ.92 లక్షల 90 వేల రూపాయలు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను అన్నవరం దేవస్థానంలో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కాకినాడ బ్రాంచ్ ద్వారా అరుంధతి మహిళా స్వయం ఉపాధి పధకం క్రింద 36 గ్రూపులకు సుమారు రూ.19.5 లక్షలు, వశిష్ఠ పురుష స్వయం ఉపాధి పథకం క్రింది 21 గ్రూపులకు రూ.10.95 లక్షలు, స్వయం ఉపాధి రుణాల క్రింద పంపిణీ చేయడం జరిగిందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ మల్లాది విష్ణు తెలియజేశారని చెప్పారు. ఆర్ధికంగా అవసరమైన వారు గ్రూపు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు కాకినాడ బ్రాంచ్ ఇన్ ఛార్జ్ శ్రీకాంత్ ను 0884-2306644 లేదా 98855 47599 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us