UPDATED 21st DECEMBER 2018 FRIDAY 5:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా రెండురోజుల పాటు నిర్వహించిన ఖోఖో పోటీలు విజయవంతంగా ముగిసాయి. పురుషుల విభాగంలో కైట్ ఇంజనీరింగ్ కళాశాల (కోరంగి) ప్రథమస్థానం, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (సూరంపాలెం) ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే మహిళల విభాగంలో పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కాకినాడ) ప్రథమస్థానం, ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల (సూరంపాలెం) ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎమ్ వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, విజేతలను అభినందించారు.







