కమ్మేస్తున్న కాలుష్యం

* కాలుష్యం బారి నుంచి కాపాడాలని ఆర్డీవోకు ఫిర్యాదు
* తక్షణం స్పందించిన ఆర్డీవో
* కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలని ఆదేశం

UPDATED 27th JANUARY 2020 MONDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణాన్ని కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కాలుష్యం బారి నుంచి ప్రజలను కాపాడాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబుకు పలు ప్రజా సంఘాల నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్దాపురం పట్టణ పరిధిలో నెలకొని ఉన్న పలు ఫ్యాక్టరీల నుంచి వస్తున్న నల్లని బూడిద స్థానిక సుధా కాలనీ, బ్యాంకు కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్ళపై పడుతోందని, కళ్ళల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యంతో తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని, ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విఫలమవడం వల్లే  కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆర్డీవోకు వివరించారు. దీనిపై స్పందించిన ఆర్డీవో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలను తక్షణమే తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ ముస్తఫా, ఎండి ముక్తార్ ఆలీ, సీఐటీయూ నాయకులు దారపురెడ్డి క్రాంతికుమార్, దారపురెడ్డి కృష్ణ, సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు, కెఎస్ఎన్ చౌదరి, కె. సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.       

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us