UPDATED 6th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: 20వ వేదశాస్త్ర పండిత సత్కార సభ స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, ఈవో పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన వేదసభలో హిందూ సంస్కృతి-సాంప్రదాయానుసారంగా చతుర్వేద పారాయణ వేదస్వస్థి నిర్వహించారు. ఈ సభలో పలువురు ఘనాపాఠీలు, క్రమాపాటీలు, స్మార్తులు, తదితర వేదపండితులు పాల్గొన్నారు. అనంతరం వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో పండితులను ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు వెంకన్నకుమార్ అంజిబాబు, చెరుకూరి రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.







