మెక్లారిన్ పాఠశాలలో అవగాహనా సదస్సు

UPDATED 10th MARCH 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక మేరీ మెక్లారిన్ పాఠశాలలో విద్యార్థుల తల్లితండ్రులతో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన విద్యావంతులుగా ఎలా తయారుచేయాలి, చదివించాలి అనే అంశంపై తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కార్యదర్శి సేపేని సురేష్ హాజరై మాట్లాడారు. పాఠశాలలో చదువుతో పాటు ఇంట్లో కూడా తల్లిదండ్రులు పిల్లల  చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాలకు రోజూ వెళ్లే రోడ్డులో దుమ్ము, ధూళితో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని, లారీల వల్ల అనేక ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి  పాఠశాలకు ఆలస్యం జరగడంతో విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లీజియన్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us