విప్లవాత్మక మార్పులకు నాంది ఇంజనీరింగ్ విద్య

* విజయనగరం జెఎన్టీయుకె ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి
* దివిలి కిట్స్ లో ఘనంగా ముగిసిన రెజల్యూషన్స్-2020
* ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

UPDATED 14th MARCH 2020 SATURDAY 10:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : విప్లవాత్మక మార్పులకు నాంది ఇంజనీరింగ్ విద్య అని విజయనగరం
జేఎన్టీయూకే ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి పేర్కొన్నారు. మండలంలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రెజల్యూషన్స్-2020 కల్చరల్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన ముఖ్య పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ముఖ్యంగా స్కిల్ డవలప్ మెంట్  పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారు అన్నివిధాల అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాల్లో తమ కళాశాలకు చెందిన అధిక సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలకు అర్హత సాధించారని తెలిపారు. అనంతరం కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్ చక్రవర్తిని పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఫెస్ట్ కన్వీనర్ బేతినీడి వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక  కార్యక్రమాలు, ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ ఎంతగానే ఆకట్టుకున్నాయి. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు హుషారుగా స్టెప్పులు వేస్తూ సహచర విద్యార్థులను ఆట,పాటలతో ఉర్రూతలూగించారు. విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్, ఏవో కెఆర్ సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసివో పెదకాపు, మేనేజర్ పి. శ్రీధర్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us