ఓటుహక్కుపై చైతన్యం అవసరం

UPDATED 25th JANUARY 2019 FRIDAY 8:00 PM

గండేపల్లి: యువత ఓటుహక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాది విజయ్ మతుకుమిల్లి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో జాతీయ ఓటరు దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాది విజయ్ మతుకుమిల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు బలమైన ఆయుధమని, దానిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. విద్యావంతులైన మీరు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజాస్వామ్యానికి అది ఎంత అవసరమో తెలియజెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం ఆయనను దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us