Dinosaur : మధ్యప్రదేశ్ లో కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ రాతి గుడ్లు

UPDATED 13th FEBRUARY 2022 SUNDAY 02:00 PM

Dinosaur’s stone eggs : డైనోసార్లు.. భూమిపై అతి పెద్ద ప్రాణులుగా గుర్తింపు పొందాయి. అయితే చాలా కాలం క్రితమే డైనోసార్లు అంతరించిపోయాయి. కానీ వాటి గుడ్లు శిలాజీకరణ రూపంలో ఇప్పటికీ బయటపడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని బడవానీ అడవిలో పది డైనోసార్ రాతి గుడ్లను కొనుగొన్నారు. ఈ ఆసక్తికరమైన వార్తకు సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం కేంద్రంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పురాతన శిల్పాలు, కోటలపై గత జనవరి 30న పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ డిపి. పాండే సర్వే ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న అటవీ అధికారులతోపాటు వర్ల తహసీల్ లోని హింగ్వా గ్రామ సమీపంలోని అడవికి వెళ్లారు. ఈ సందర్భంగా రాతి గుడ్లు పాండేకు కనిపించాయి.

వాటిలో ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగిలినవి 25 కేజీల మేర ఉన్నాయి. ఇవి కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ గుడ్లుగా గుర్తించారు. వీటిని ఇండోర్ మ్యూజియంలో ఉంచనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us