UPDATED 19th FEBRUARY 2019 TUESDAY 7:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ అమ్మవారి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా చండీ హోమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటని, లోక కళ్యాణార్ధం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్ సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోందని ఈ సందర్భంగా వేద పండితులు చండీ హోమం విశిష్టతను భక్తులకు వివరించారు. హోమం అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఎన్.వి. శాస్త్రి, ఐవి ప్రసాద్ శర్మ, ఏవీ భానుమూర్తి, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ విజయలక్ష్మీ, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.







