UPDATED 18th APRIL 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: గ్రామీణ స్వరాజ్ అభియాన్ ఉత్సవ్ లో భాగంగా మండలంలోని వల్లూరు గ్రామంలో స్వచ్ఛభారత్ దివస్ ర్యాలీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. చెంబుకు స్వస్తి పలికి బహిరంగ మలవిసర్జన జరగకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, ఎంపిడివో, పంచాయితీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.







