అన్నవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: అన్నవరం సత్యదేవుడికి పంచామృతాభిషేకాలు జరుగుతుండగానే భక్తులు క్యూలైన్ల ద్వారా శనివారం వేకువనే స్వామిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సత్యదేవుని జన్మనక్షత్రం సందర్భంగా శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాతం, 2 గంటలకు మహన్యాసం జరుగుతుంది. అనంతరం 3 గంటల నుంచి 4.30 వరకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సాధారణంగా అభిషేకం సమయంలో ప్రత్యేక టికెట్లు పొందిన వారికి మినహా సాధారణ భక్తులను అనుమతించరు. సత్యదీక్షల విరమణ, రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 3 నుంచి 4.30 గంటల వరకు స్వామికిఅభిషేకం జరుగుతుండగానే క్యూలైన్లలో(అంతరాలయం బయట నుంచి) భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారి ఆలయంలోచండీహోమం నిర్వహించారు. 3,333 వ్రతాలు జరిగాయి. రూ.33.56 లక్షల ఆదాయం సమకూరింది
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







