UPDATED 6th MARCH 2018 TUESDAY 10:00 PM
సామర్లకోట: పట్టణ పరిధిలోని విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో ఇళ్ల మధ్య ఉన్న క్రైస్తవ ప్రార్ధనా మందిరాన్ని తొలగించాలని స్థానిక ప్రజలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. హిందువులు నివాసం ఉన్న ప్రదేశంలో చర్చిని ఏర్పాటు చేసి అక్కడి వారిని ఇబ్బంది కలిగిస్తున్నారని హిందూ ధర్మరక్షా సమితి జిల్లా సభ్యుడు పుట్టా రాజారావు, కార్యదర్శి యార్లగడ్డ అక్కిరాజు అన్నారు. గతంలో చర్చిని తొలగించడానికి అంగీకరించి, ప్రస్తుతం మైకు ఏర్పాటు చేయడంతో విద్యార్థులను చదువుకు ఇబ్బంది కలుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు ఫిర్యాదు చేశారు.







