UPDATED 12th JULY 2019 FRIDAY 8:30 PM
పెద్దాపురం: పెద్దాపురం ఐసిడిఎస్ సీడీపీవోగా పంతం సావిత్రి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ అర్బన్ సీడీపీవోగా పనిచేస్తూ బదిలీపై ఆమె ఇక్కడకు వచ్చారు. ఇంతవరకు ఇక్కడ సీడీపీవోగా విధులు నిర్వర్తించిన ఆదుర్తి విజయలక్ష్మి కాకినాడ అర్బన్ సీడీపీవోగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, తదితరులు ఆమెను కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.







