గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: ఇటీవల రంపచోడవరం మండలం పోలవరం కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలానికి చెందిన జియ్యంపాలెం టీడీపీ గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శి సోర్లం నాగ వెంకట దుర్గాప్రసాద్ దొర, జోడి రాజుబాబు కుటుంబ సభ్యులను టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో నాయకులు బుధవారం పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. మృతుల కుటుంబాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలబంధ ఎంపీటీసీ సభ్యుడు పండ ఆదినారాయణ దొర, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కమ్మరి రాంబాబు, భాను ప్రకాష్, వీరబాబు బాలకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







