కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలి

UPDATED 29th JUNE 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సిపిఎం, వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినా సరే ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని ఆయన విమర్శించారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.ఈ ర్యాలీలో కరణం గోవిందు, శ్రీనివాసు, పెదిరెడ్డి సత్యన్నారాయణ, బాలాజీ, వీరబాబు, కె. శివ, గోపాల్, మిల్కీ, వెంకటేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us