UPDATED 22nd DECEMBER 2019 SUNDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణంలో గల ప్రసిద్ధ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర బహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష్మీ గణపతి హోమాన్నిఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, శేషారత్నం దంపతులు, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం, గోపూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో పలువురు వేద పండితులు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలుత విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, మండపారాధన, తదితర పూజాదికాలను నిర్వహించారు. అలాగే గోపూజా కార్యక్రమంలో భాగంగా గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా చెరకు గడలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. అలాగే హోమంలో పాల్గొన్న భక్తులకు ప్రసిద్ధ చెందిన అయినవిల్లి వినాయక చిత్రపటాలను అందచేశారు. సుమారు 500 మంది భక్తులు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.







