వైసీపీలో చేరిన టిడిపి మాజీ సర్పంచ్

UPDATED 11th MARCH 2020 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం వికె రాయపురం గ్రామ మాజీ సర్పంచ్ కుర్రా  నారాయణస్వామి తన వర్గీయులతో సహా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు వారికి పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీతో పాటు మరికొన్ని పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తలారి దొరబాబు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us