UPDATED 25th JULY 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సభ్యుల బృందం జగన్‌ను కలిశారు. న్యాయవాదులకు డెత్‌క్లైమ్‌ను రూ. పది లక్షలకు పెంచాలని, హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ రూ. పది వేలు ఇవ్వాలని, లైబ్రరీకి రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్‌కు రూ.150 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పేరిశెట్టి మృత్యుంజయరావు, ఎం.కె. మొహిద్దీన్, కర్రా ఎలీషారావు, తటవర్తి సత్యనారాయణ, సారా రామచంద్రరావు, పిట్టా సుగుణారావు, దారా శ్రీనివాస్, సి.హెచ్. కనక దుర్గారావు, చంద్రశేఖర్, అత్తిలి ప్రభూజీ, మడికి రాంబాబు, రాగాల కామేష్, ఎస్.కె. వల్లిబాబు, ముమ్మన సోమరాజు, తదితరులు పాల్గొన్నారు.







