ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: దీర్ఘకాలం తరువాత కలెక్టరేట్‌లో మంగళవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎస్‌సీ) సమావేశాన్ని నిర్వహించారు. జేఎస్‌సీ ఛైర్మన్‌, కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి గుర్తింపు పొందిన 15 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్స్‌, కారుణ్య నియామకాలు, పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ రెగ్యులైజేషన్‌, హెల్త్‌కార్డులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు జారీ, ఈఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, పదవీ విరమణ గ్రాట్యూటీ సకాలంలో అందించాలని కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ.. స్థానికంగా పరిష్కరించే అంశాలను వెంటనే పూర్తి చేస్తామన్నారు. కొవిడ్‌తో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు అదే పోస్టులో ఉద్యోగం కల్పించే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతీ సోమ, శనివారాలు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటానని, సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని సూచించారు. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us