UPDATED 31stOCTOBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: దేశ సమగ్రతకు పాటుపడిన మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శప్రాయుడని మున్సిపల్ కమీషనర్ సిహెచ్.వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామక్రిష్ణ అధ్యక్షతన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ కమీషనర్ పాల్గొని తొలుత సర్ధార్ వల్లభాయ్ పటేల్, అలాగే ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం సమున్నతంగా నిలబడాలన్నా ఆకాంక్షతో తన రాజనీతిజ్ఞతతో దేశంలో గల సుమారు 550 సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతాన్ని నిర్మించిన జాతి నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజలందరికీ ఆరాధ్యనీయులని అన్నారు. ఇంగ్లాండుతో న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన పటేల్ స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత జాతీయోధ్యమానికి ప్రభావితులయ్యారన్నారు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారని, రాజ్యాంగ రచనలోనూ ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాతీయ సమైక్య తా ప్రతిజ్ఞ విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కమీషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏపీ రాజేంద్రకుమార్, జి. రమాదేవి, జి. గోవిందు, కె. అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, శ్రీనివాస్, డి.వి.ఆర్.ఎన్. శ్రీవల్లి, శ్రీలక్ష్మి, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.







