UPDATED 4th DECEMBER 2019 WEDNESDAY 10:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ గా అనంత ఉదయ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఎల్లవరం గ్రామానికి చెందిన ఉదయభాస్కర్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే సభ్యులుగా శెట్టిబత్తుల రాజబాబు (శంఖవరం), ఐ. సత్యగోపాలకృష్ణ (భట్నవిల్లి), సయ్యద్ మొహిద్దీన్ (పిఠాపురం), పంతం శ్రీదుర్గాభవానీరాం (వీరవరం), బండారు సత్తిరాజు (కొత్తపేట), పి. సోమరాజు (తుని)లను నియమించారు. మూడు నెలలు క్రితం డిసిసిబి పాలకవర్గం గడువు ముగిసింది. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంతవరకు ప్రత్యేకాధికారిగా భాద్యతలు నిర్వర్తించారు.







