చిన్నారుల సంరక్షణకు చర్యలు

* ఐసీడీఎస్ పీడీ డి. పుష్పమణి

UPDATED 22nd JUNE 2020 MONDAY 9:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): ఇటీవల సీతానగరం మండలం కొత్తూరు గ్రామంలో తల్లి ఒడి నుంచి మాయమై బావిలో శవమై తేలిన 15 రోజుల చిన్నారిపై జరిగిన సంఘటన మాతృత్వానికే మచ్చ తెచ్చే అత్యంత విషాదకరమైన సంఘటన అని జిల్లా స్త్రీ,శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. పుష్పమణి  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో ఇంకా ఆడ, మగ అని లింగ వివక్షత చూపడం చాల దురదృష్టకరమని అన్నారు. ఒకవేళ ఆడపిల్ల భారమని ఎవరైనా భావిస్తే అలాంటి చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా రాజమహేంద్రవరం స్త్రీ సదనంలో గల బాలల సంక్షేమ సమితికి అప్పగించవచ్చని, అలా ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం జరుగుందని తెలిపారు. తల్లిదండ్రులు వద్దు అనుకున్న పిల్లలను సంరక్షించడానికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊయల పెట్టడం జరిగిందని అందులో పెట్టి కనీసం మనుషులుగా వ్యవహరించాలే తప్పు రోడ్డు ప్రక్కన, చెత్త కుప్పల్లో వదిలిపెట్టరాదని అన్నారు. ఇలాంటి బాలలను కాకినాడలోని శిశుగృహలో ఆశ్రయం కల్పించి పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్టపరంగా దత్తత ఇవ్వడం జరుగుతుంని, చిన్నారులే దేశ సంపదగా భావించి భారంగా భావించే పిల్లలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించాలని కోరారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావిస్తే అంగన్వాడీ కార్యకర్త, మహిళా పోలీస్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098లలో ఏ అధికారినైనా సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us