UPDATED 8th JULY 2017 SATURDAY 7:00 PM
➡ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువతి
➡ దాతల సహాయం కోసం ఎదురు చూపు
పెద్దాపురం: ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండాల్సిన వయసులో ఆ యువతి జీవితంపై దేవుడు చిన్న చూపు చూశాడు. అసలే రెక్కడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. పేదరికానికి తోడు వ్యాధి బారిన పడటంతో ఆ కుటుంబానికి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. తమ కుమార్తె వ్యాధికి చికిత్స కోసం దాతల సహకారం కోరుతున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆ యువతిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన మలిరెడ్డి వెంకన్న దొర, దుర్గాలక్ష్మి దంపతుల కుమార్తె గంగాదేవి గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో భాదపడుతోంది. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆ యువతి నిస్సహాయ స్థితిలో ఉంది. కుమార్తె బాధను చూసి తల్లిదండ్రులు ఏమీ చెయ్యలేక తల్లడిల్లిపోతున్నారు. తమ కుమార్తె ఇటువంటి వ్యాధికి గురికావడంపై తల్లిదండ్రుల బాధను చూస్తున్న వారికి హృదయం కలచివేస్తోంది. అసలే పేదరికం కావడంతో చికిత్స చేయించేందుకు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ కుమార్తెకు వైద్య సహాయం అందించేందుకు సహకరించాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది చూసి చలించిపోయిన కొంతమంది గ్రామానికి చెందిన యువకులు సహాయసహకారాలు అందించారు. అయితే లక్షలాది రూపాయలు ఖర్చు కారణంగా పలువురి సహాయాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆ యువతిని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. సహాయం చెయ్యదలచినవారు ఈ క్రింది అకౌంట్ నంబరు 711010025000063 , చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ifsc code ANDBOCG7110 లేదా సెల్ నెంబర్ 7893325066 నెంబర్ లో సంప్రదించాలని కోరుతున్నారు.







