గైట్ లో ఘనంగా ముగిసిన సహస్ర 2018

UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో రెండు రోజులు పాటు నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవం సహస్ర-2018 శుక్రవారంతో ఘనంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభకు ముఖ్యఅతిధిగా సౌమ్య కనస్ట్రక్షన్స్ అధినేత జి. నారాయణ పాల్గొని విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు ఉపయోగపడే ఇంటర్న్ షిప్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ సుమారు 30 కళాశాలల నుంచి 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రస్తుతం పరిశ్రమలలో అధికంగా ఉన్న ఐవోటి, టోటల్ స్టేషన్ పై వర్క్ షాపులు నిర్వహించామన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను, నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడే పలు సాంకేతిక పోటీలు నిర్వహించామన్నారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల తమ సృజనాత్మకతను, నైపుణ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయని, తద్వారా మనదేశం పూర్తిగా అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఇసిఇ విభాగం విద్యార్థులు తయారుచేసిన ఫైర్ కిల్లింగ్ రోబో, సిఎస్ఈ విభాగం విద్యార్థుల ఆటోమేటిక్ డస్ట్ కలెక్టర్, రక్షణ విభాగంలో శత్రువులను సెన్సార్ల ద్వారా గుర్తించి అరికట్టడం వంటి ప్రాజెక్టులు, వోఎల్ఈడి, బివోటి కమ్యూనికేషన్స్ పై వివరించిన ప్రాజెక్టులు, నేటి యువతపై చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ధనరాజ్, డాక్టర్ పి.ఆర్.కె. రాజు విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందచేశారు. విజేతలను కళాశాల వైస్ చైర్మన్ శశివర్మ అభినందించారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us