రజక సంక్షేమానికి పాటుపడే వ్యక్తులను చైర్మన్ గా నియమించాలి

* ఏపీ రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కాకినాడ రామారావు

UPDATED 22nd JULY 2020 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రజకుల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించే అవినీతి లేని వ్యక్తులను రజక ఫెడరేషన్ కు చైర్మన్ గా నియమించాలని ఏపీ రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కాకినాడ రామారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ దేశంలో సుమారు ఐదు కోట్ల మంది రజకుల జనాభా ఉండగా వారిలో మూడు కోట్ల ఏభై లక్షల మంది ఎస్సీ జాబితాలో, మిగిలినవారు బీసీ జాబితాలో ఉన్నారని అన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ లుగా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్న రజకులు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు రజకులను ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రజక ఫెడరేషన్ కు చైర్మన్ ను నియమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించడం హర్షణీయమని తెలిపారు. పార్టీలు ముద్రతో ఎవరికిబడితే వారికి పదవి కేటాయిస్తే రజక జాతికి ఒరిగేది ఏమి ఉండదని, అన్ని జిల్లాల నుంచి తగు సమాచారాన్ని సేకరించి అర్హులైన వ్యక్తులను ఫెడరేషన్ చైర్మన్ గా నియమించాలని సూచించారు. మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తిస్తూ కేంద్రానికి సిఫార్సు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేదోడు పధకానికి ఆంక్షలను సడలించి కుల ధృవీకరణ పత్రం ప్రామాణికంగా తీసుకుని వర్తింపచేయాలని ఆయన కోరారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us