నాలుగవ రోజు ఎన్ఎస్ఎస్ ఆయుష్కం ప్రత్యేక శిబిరం

UPDATED 9th JANUARY 2019 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: మండల పరిధిలోని ఆనూరు గ్రామంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల, ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నాల్గవ రోజు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో భాగంగా బుధవారం అవయవ దానం ప్రాముఖ్యతను గ్రామస్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ చైర్మన్ బాదం బాలకృష్ణ హాజరయ్యారు. ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిబిరంతో ప్రజలకు తగిన అవగాహన, చైతన్యం తేవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అవయవ దానం చేయండి - ప్రాణదాతలు కండి అంటూ విద్యార్థులు గ్రామంలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి అవయవదాన ప్రతిజ్ఞ చేయించి డోనార్ కార్డులు పంచి పెట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అవయవ దానానికి కావాల్సిన అర్హతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింగన అరవిందకుమార్, పంచాయతీ కార్యదర్శి పద్మరాజు, కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్, అధిక సంఖ్యలో గ్రామస్థులతో పాటు ప్రగతి కళాశాల విద్యార్థులు, తదితరులు హాజరైనట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి. ప్రవీణ్ తెలిపారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us