UPDATED 7th FEBRUARY 2020 FRIDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఒక సాధారణ ప్రయాణికుడిలా పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వయా ద్వారపూడి మీదుగా వెళ్లే బస్సులో ఆయన శుక్రవారం రాజమహేంద్రవరం వరకూ ప్రయాణించారు. సామర్లకోటలో సాయంత్రం బస్సు ఎక్కిన ఆయన సుమారు రెండున్నర గంటలపాటు బస్సులోనే ఉన్నారు. విద్యార్థులు, ప్రయాణికులతో మాట్లాడి రవాణా సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. ఆయనతో పాటు ఇతర అధికారులు కూడా అదే బస్సులో ప్రయాణించారు.







