UPDATED 5th JUNE 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ఒలెంపిక్ రన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు పురస్కరించుకుని జిల్లా ఒలెంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఒలెంపిక్ రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఒలెంపిక్ రన్ అసోసియేషన్ కార్యదర్శి కె. పద్మనాభం తెలిపారు. స్థానిక ప్రతిభా విద్యా సంస్థల ఆవరణలో జిల్లా ఒలెంపిక్ రన్ అసోసియేషన్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పద్మనాభం మాట్లాడుతూ ఈ నెల 23న ఒలెంపిక్ డే రన్ పురస్కరించుకుని సుమారు ఐదు వందల మంది క్రీడాకారులతో 25 సెంటర్లలో జరుగుతుందన్నారు. ఈ రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడలో పాల్గొంటారని, మిగిలిన పట్టణాలు, మండల కేంద్రాలు, ఏజెన్సీ మండలాల్లో అర్జున అవార్డు గ్రహీతలు, జాతీయ క్రీడాకారులతో పాటు ఇతర అధికారులు పాల్గొంటారన్నారు. జూన్ ఇరవై మూడు ఉదయం ప్రారంభమయ్యే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు డిసెంబర్ నెలాఖరు వరకూ జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సెక్రటరీ డాక్టర్ స్పర్జన్ రాజు, వి. రవిరాజు, ప్రతిభా విద్యానికేతన్ కరస్పాండెంట్ ఎస్.వి.వి.జి. ప్రకాష్, టి. వైకుంఠం, ఎం.డి.వి. ప్రసాద్, కె. సుబ్రహ్మణ్యం, వి.ఎస్. రంగారావు, కె. సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







