UPDATED 27th NOVEMBER 2017 MONDAY 7:30 PM
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాకి ముందుగా అనుకున్నట్లే ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌లో పవన్ సోఫాలో స్టైల్‌గా కూర్చుని చేతిలో ఐడీ కార్డు తిప్పుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట ‘బయటికొచ్చి చూస్తే’కు విశేష ఆదరణ లభించింది. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.







