వైఎస్సార్సీపీలోకి పలువురు చేరికలు

UPDATED 10th JUNE 2020 WEDNESDAY 6:30 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు. వారికి దొరబాబు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రజారంజక పాలనకు, అవినీతి రహితంగా అర్హులైన వారికి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను గడగడపకూ చేరవేస్తున్న విధానం, నియోజకవర్గ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు పనితీరు నచ్చి ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రామ నాయకులు మలకల సూరిబాబు నాయకత్వంలో ఇతర‌ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామ అభివృద్ధికి సహరిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నరాలశెట్టి సుబ్రహ్మణ్యం, నరాలశెట్టి వీరరాఘవులు, సత్తిబాబుతో కూడిన 50 మంది కార్యకర్తలు, జనసేన పార్టీకి చెందిన నాయకులు నువ్వుల బాబ్జితో పాటు పలువురికి దొరబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దొరబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి  అనేక పథకాలు రూపకల్పన చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దొరబాబు మలకల సూర్యారావు, అన్నపూర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు మలకల సూర్యారావు, వరాల బాబు, ఎలిశెట్టి నరేష్, తోటకూర రాంబాబు, సత్తిబాబు, తోటకూర వెంకటేశ్వరరావు, సూర్య ప్రభాకరరావు, గంగాధర్, యల్లమిల్లి వీరభద్ర ప్రసాదరావు, బండారు సత్యనారాయణ, ఆటపాకల సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us