UPDATED 8th MARCH 2018 THURSDAY 9:30 PM
సామర్లకోట: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపిపి ఆకునూరి సత్తిబాబు పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గురువారం మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, అలాగే వారి అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళాభ్యుదయంతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. తహసీల్దార్ ఎల్. శివకుమార్ మాట్లాడుతూ మహిళా చైతన్యం మరింతగా పెరగాలని పేర్కొన్నారు. ఈ సందర్భముగా మహిళలకు ముగ్గులు, రన్నింగ్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, మండల విద్యాశాఖాధికారి కె. వెంకట రమణమ్మ, ఏపీయం జగదీశ్వరి, అకౌంటెంట్ శ్యామ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కె. మేరీ కుమారి, ఈవోపీఆర్డీ సి.హెచ్. జగ్గారావు పాల్గొని మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్పీటీసీ విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు.







