UPDATED 5th JANUARY 2019 SATURDAY 5:00 PM
రాజానగరం: గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులకు మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్)పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సాంకేతికవిద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల, అధ్యాపకుల, యాజమాన్య సమాచారాన్ని ప్రభుత్వం త్వరలో ఆన్ లైన్ చేయనుందని, దీనివల్ల కళాశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం పారదర్శకంగా పొందే అవకాశం ఉంటుందని, అందుకే ఈ శిక్షణ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతీ పాలిటెక్నిక్ కళాశాల సమాచారాన్ని ఆన్ లైన్ లో పొందుపరచాలని కోరారు. ఈ శిక్షణా తరగతులను యూనికాప్స్ సోలుషన్స్ సంస్థకు చెందిన రవితేజ ప్రతినిధుల బృందం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిజి రామానుజం, శిక్షణ కోఆర్డినేటర్ వరప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.







