పర్యావరణ పరిరక్షణ వృక్ష సంరక్షణతో సాధ్యం

* సబ్ కలెక్టర్ సాయికాంతవర్మ

UPDATED 11th OCTOBER 2018 THURSDAY 9:00 PM

రాజానగరం: పర్యావరణ పరిరక్షణ వృక్ష సంరక్షణతోనే సాధ్యపడుతుందని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సి.ఎం. సాయికాంత వర్మ అన్నారు. స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండల పరిధిలోని వెలుగుబంద గ్రామంలో గురువారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ సాయికాంతవర్మ మాట్లాడుతూ మొక్కలు పెంపకంతోనే పర్యావరణాన్ని సంరక్షించుకోవచ్చని, విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ విషయంలో  కూడా భాద్యత వహించాలని సూచించారు. రాజానగరం ఎంపిడివో ఇ. మహేశ్వరావు మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించేందుకు, స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందించేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే మొక్కలు పెంపకం పట్ల శ్రద్ద వహించాలని అన్నారు. వెలుగుబంద గ్రామంలో మండల పరిషత్ యు.పి. స్కూల్ సమీపంలో సబ్ కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.డి. శివప్రసాద్, వెలుగుబంద గ్రామపంచాయతీ కార్యదర్శి డి. సుబ్రహ్మణ్యం, విఆర్వో పి. గనిరాజు, మాజీ సర్పంచ్ పెద్దిశెట్టి నారాయణస్వామి, జన్మభూమి కమిటీ సభ్యులు, అధికుల సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.              

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us