UPDATED 21nd JANUARY 2020 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): బ్యాంకులో డబ్బులు డ్రా చేసి తీసుకువెళ్తుండగా దుండగులు చోరీ చేసిన సంఘటన సామర్లకోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దాపురం మండలం రాగంపేటకు చెందిన నల్లె మల్లికార్జునరావు స్థానిక ఆంధ్రాబ్యాంకులో సోమవారం రూ.50 వేలు డ్రా చేసి సైకిల్ మీద వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను వెనకాల బైక్ పై ఫాలో అయ్యారన్నారు. సామర్లకోట, రాగంపేటకు మధ్యలో గల మిర్యాల పుంతలో తన పొలంలోకి వెళ్లగా దుండగులు క్యాష్ బ్యాగ్ ను లాక్కుని పరారయ్యారన్నారు. సంఘటన స్థలాన్ని సామర్లకోట ఎస్ఐ సుమంత్, పెద్దాపురం ఎస్ఐ సురేష్, విఆర్వో గోపాలకృష్ణ, తదితరులు మంగళవారం పరిశీలించారు.







