శాకాంబరిగా బాలాత్రిపురసుందరి అమ్మవారు

UPDATED 30th JULY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆషాడ బహుళ త్రయోదశి తిథిని పురస్కరించుకుని మంగళవారం బాలా త్రిపురసుందరి అమ్మవారు  వివిధ రకాల కూరగాయలు, ఫల, పుష్పాలతో శాకాంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయంలో ఉదయం నుంచి సంకల్పము, విఘ్నేశ్వరపూజ, ఋత్విక్వరుణ, దీక్షధారణ, చండీ పారాయణం, చండీహోమం, పూర్ణాహుతి, పండిత ఆశీర్వచనం, లలితా సహస్రనామ పారాయణం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా  నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ఆలయ అర్చకులు సన్నిధిరాజు వెంకన్న, సన్నిధిరాజు సుబ్బన్న, చెరుకూరి రాంబాబు, వేమూరి సోమేశ్వరశర్మ, అధిక సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us