లెనోరాలో భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ

UPDATED 25th JANUARY 2018 THURSDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఉన్న కె.ఎల్.ఆర్ లెనోరా దంత వైద్యశాల, ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ జాతీయ పతాకాన్ని ఈ నెల 26న ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వ ప్రకాష్ షెట్టి గురువారం వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 69 అడుగుల వెడల్పు, 46 అడుగుల ఎత్తు గల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం రాజమహేంద్రవరం డీఎస్పీ నాగరాజు పరిశీలించారన్నారు. భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భద్రతా చర్యలు ఏవిధంగా తీసుకోవాలో తెలియచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జి. నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, పిజి స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ బి. లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. దాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us