UPDATED 19th MARCH 2020 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. ప్రాణాంతక కరోనా వ్యాధిపై మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ సుమారు 130 దేశాలకు పాకిన భయంకరమైన అంటువ్యాధి కరోనా అని, దీని తీవ్రత కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పరిశుభ్రత పాటిస్తూ చేతులు సబ్బు, లోషన్‌తో పలుమార్లు శుభ్రం చేసుకోవాలని, మాస్క్‌లు, గ్లౌజులు ధరించి ప్రాణాంతకమైన కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటిస్తూ తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్, హెల్త్ అసిస్టెంట్ పి. చిట్టిబాబు, పారిశుధ్య, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







