కోటి తలంబ్రాల పంట ఉత్సవం

గోకవరం, 15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): భద్రాచలం, ఒంటిమిట్టలలో వైభవోపేతంగా జరిగే సీతారాముల కల్యాణానికి కోరుకొండ శ్రీకృష్ణఛైౖతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తుంటారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలోని పొలంలో సోమవారం ప్రత్యేక పూజల మధ్య కోటితలంబ్రాల పంట సాగును ప్రారంభించారు. శ్రీరాముడు, హనుమంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో సీతారామలక్ష్మణుల విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రామ నామాన్ని జపిస్తూ నాగలితో పొలాన్ని దున్ని ఒడ్లు చల్లారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us