UPDATED 18th JULY 2017 TUESDAY 10:00 AM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన మాసిన హేమామాధురి నూజివీడులోని ట్రిపుల్ ఐటికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.శంకర్ నారాయణ తెలిపారు. ట్రిపుల్ ఐటిలో సీటు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమామాధురిని ఎంఈవో జి.వి.ఆర్. దుర్గా ప్రసాద్, జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, ఎంపిటిసిలు అడపా గంగాధరం, గుత్తుల సూర్యావతీ శ్రీనివాస్, సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం తదితరులు అభినందించారు.







