భీమేశ్వరస్వామి ఆలయంలో తోట వాణి పూజలు

UPDATED 19th MARCH 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థిని తోట వాణి మంగళవారం ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి, బాలా త్రిపురసుందరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామర్లకోట లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి మట్టపల్లి రమేష్ బాబు ను కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పధకాలు గురించి ప్రజలకు వివరించారు. ప్రతీ కార్యకర్త జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. డబ్బై సంవత్సరాల చరిత్ర గల పెద్దాపురం నియోజకవర్గంలో ఇంత వరకూ ఎవరూ కూడా మహిళలకు అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్ తనకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ పెద్దాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోలి వెంకట అప్పారావు చౌదరి, ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్, వాసంశెట్టి గంగ, మట్టపల్లి రమేష్, బంగారు కృష్ణ, బొబ్బరాడ సత్తిబాబు,  మద్దాల శ్రీను, సేపేని సురేష్, పి. సూరిబాబు, నక్కా జానకిరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us