* జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
UPDATED 22nd JULY 2020 WEDNESDAY 9:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల ఇళ్ళ వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలక్టర్ (ఆర్) డాక్టర్ జి. లక్ష్మీశ వివిధ మాల్స్ ప్రతినిధులను ఆదేశించారు. స్థానిక కలక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ నుంచి కాకినాడ నగరంలో గల స్పెన్సర్స్, రిలయన్స్ మార్ట్, డీమార్ట్, మోర్ సూపర్ మార్కెట్, ఏపీ డైరీ, సూపర్ బజార్, విక్టరీ బజార్, తదితర మాల్స్ ప్రతినిధులతో బుధవారం జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సకాలంలో నిత్యావసర సరుకులను ఇళ్ళకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా అన్ని మాల్స్ లో అమలు చేయాలని ఆయన ఆదేశించారు.







