పాఠశాలలు అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలి

UPDATED 3rd JANUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): విద్యార్థులు తాను విద్యను అభ్యసించిన పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని  ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు అలమండ ప్రసాద్, జి.నరసింహమూర్తి, శివప్రసాద్, బాబూరావు, తదితర పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1984-85 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విజేతలకు రూ.16 వేలు నగదు బహుమతులుగా అందించనున్నట్లు వారు ప్రకటించారు. అలాగే గత ఏడాది నవంబర్ నెలలో పాఠశాల ఆవరణలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎం.వి. ప్రసాదరావు, ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, రంగా, బాలరాజు, పద్మావతి, కోటేశ్వరరావు, రాజారావు, సత్యనారాయణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us