ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

UPDATED 22nd DECEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన బళ్లా రాజమణి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా రూ.60,690, పుప్పాల వెంకటరమణకు రూ.50వేలు నగదు చెక్కులను రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం అందజేశారు. టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు చల్లా బుజ్జి వారి పరిస్థితిని హోంమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి వెంటనే స్పందించి  ముఖ్యమంత్రి  సహాయనిధి నుంచి మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మళ్ల రామకృష్ణ, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us