ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు

* 108 సిబ్బంది నిర్లక్ష్యం
* ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై కలెక్టరుకు ఫిర్యాదు

UPDATED 24th OCTOBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో బుధవారం  రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైద్య సహాయం కోసం సుమారు 150 మంది ఆసుపత్రికి రాగా   ఆసుపత్రిలో కేవలం ఒక వైద్యురాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో వైద్యసేవలు అందించడం చాల కష్టంగా మారింది. సాయినగర్ కు చెందిన ఒక వృద్ధుడు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రాగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. ఆసుపత్రిలో ఉన్న108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా మానవహక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, కార్యదర్శి కుంచే నానిబాబు ఈ విషయమై జిల్లా వైద్యశాఖ అధికారులకు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.               

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us