Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవే

Updated 31 January 2022 Monday 10:20 PM

Bank Holidays In February 2022 : ప్రతీ ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉండనే ఉంటుంది. దీని ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. అందరికీ ఉన్నట్లుగానే బ్యాంకులకు కూడా సెలవులుంటాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కొంతమంది ఈ సెలవులు గుర్తించకోక పోవడంతో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఏ నెలలో ఎన్ని రోజులు హాలీడేస్ ఉంటాయో గుర్తుంచుకుంటే.. బ్యాంకులకు సంబంధించిన పనులను ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చు. 31వ తేదీతో జనవరి నెల కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి 28వ రోజుల్లో పాటు మొత్తం బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు వేర్వేరు సెలవులు ఉంటాయి. కొన్ని పండుగలు, ఇతరత్ర వాటికి సంబంధించి బ్యాంకుల సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు.

◆ ఫిబ్రవరి 02వ తేదీ సోనమ్ లోచర్ (గ్యాంగ్ టక్)

◆ ఫిబ్రవరి 5వ తేదీ సరస్వతి పూజ

◆ ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం

◆ ఫిబ్రవరి 12వ తేదీ రెండో శనివారం

◆ ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం

◆ ఫిబ్రవరి 15వ తేదీ మహ్మద్ హజ్రత్ అలీ జన్మదినం (లక్నో, కాన్పూర్, ఇంఫాల్)

◆ ఫిబ్రవరి 16వ తేదీ గురు రవిదాస్ జయంతి (చండీగడ్)

◆ ఫిబ్రవరి 18వ తేదీ డోల్ జాత్రా (కోల్ కతా)

◆ ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్ పూర్)

◆ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం

◆ ఫిబ్రవరి 26వ తేదీ నాలుగో శనివారం

◆ ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం

◆ ఫిబ్రవరి నెలలో ఇన్ని రోజులు హాలీడేస్ ఉన్నా.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us