UPDATED 16th FEBRUARY 2019 SATURDAY 9:00PM
సామర్లకోట: పదవతరగతి చదువుతున్న విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అకడమిక్ కోఆర్డినేటర్ ఎం. బాబూరావు పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ప్రత్యేక అతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న పదవతరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక 10 గ్రేడ్ పాయింట్లు సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎంతో కలిసి సబ్జెక్ట్ వారీ సమీక్షను నిర్వహించారు. ప్రతి సబ్జెక్టు నుంచి కనీసం 20 మంది విద్యార్థులు ఏ వన్ గ్రేడ్ సాధించేలా టార్గెట్ పెట్టుకుంటే కనీసం పదిమందికి 10 గ్రేడ్ పాయింట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న ప్రీ ఫైనల్ పరీక్షలతో పాటు మిగిలిన మరో 15 రోజులు సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా నూరు శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని అన్నారు. గ్రాండ్ టెస్టుల ద్వారా మరోసారి రివిజన్ నిర్వహించాలన్నారు. పాఠశాల పట్టణ స్థాయిలో ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చడం పట్ల పాఠశాల పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. శ్రీలక్ష్మి, పిఏఎస్ లక్ష్మి, జి. గోవిందు, కెవివి సత్యనారాయణ, డి.వి.ఆర్.ఎన్. వల్లి, ఏ.ఎల్.వి. కుమారి, సిహెచ్ భద్రావతి, ఏపీ రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.







