UPDATED 5th FEBRUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: జాతీయస్థాయి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో మండల పరిధిలోని నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనిమిదవ తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని సన్నిబోయిన సృజన ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ సత్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ శ్రీకంఠం శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు విద్యార్థినిని అభినందించారు.







