UPDATED 27th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక బసివిరెడ్డి సత్రం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి దొరబాబు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా ఆటో యూనియన్ నాయకులు ఆయనను పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆకుల సూర్యనారాయణ, ఊబా జాన్ మోజస్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







