UPDATED 24th NOVEMBER 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది అలమండ రంగనాధస్వామి (రమేష్) సెంట్రల్ నోటరీ అడ్వకేట్ గా నియమితులయ్యారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ (న్యూఢిల్లీ) అడిషనల్ సెక్రటరీ ఎస్ఆర్ మిశ్రా నుంచి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆయన స్థానిక విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, తహసీల్దార్ వి. జితేంద్ర, ఎస్‌ఐ వి.యల్.వి.కె. సుమంత్, సీనియర్ న్యాయవాదులు ఓబిలిశెట్టి సత్యనారాయణ, పెదగోపు వెంకటేశ్వరరావు, కొర్లమండ వీరభద్రరావు, శ్రీవాణి, వనమోజు సత్య రవికుమార్, తదితరులు రంగనాధస్వామిని అభినందించారు.







